ప్రత్యేక తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నకేంద్రం:
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం ప్రకటనను హోం మంత్రి చిదంబరం బుధవారం రాత్రి 11.30 గంటలకు జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణా ప్రక్రియ ప్రారంభం లో భాగంగా తొలుత ఆంధ్రప్రదేశ్* అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడదామని ఆయన అన్నారు. అయితే ఈ తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టేది ఆయన వెల్లడించలేదు. నవంబర్* 29న కేసీఆర్* ఆమరణ నిరశన ప్రారంభించిన నాటి నుంచి ఉద్యమించిన విద్యార్ధులు కార్యకర్తలు నేతలందరిపైన పెట్టిన పోలీసు కేలును ఎత్తివేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరాహార దీక్షను తక్షణమే విరమించవలసిందిగా కేసీఆర్*కు ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలం గాణా అంశంపై రాష్ట్రంలో జరుగుతున్న పరిణా మాల వలన సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ అంశంపై మేము సంప్రదింపులు జరిపాము. ప్రధాని మన్మోహన్*సింగ్* విదేశీ పర్యటన నుంచి ఈ రోజే తిరిగి వచ్చారు. ఆంధ్రప్రదేశ్* ముఖ్యమంత్రి రోశయ్యతో సంప్రదింపులు జరిపిన తర్వాత తెలంగాణా విషయమై ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తున్నట్లు చిదంబరం తెలిపారు. తెలంగాణా అంశాలతో కూడిన ఒక ప్రకటనను ఆయన చదివి వినిపించారు. అయితే ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెట్టే విషయంపై ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఈ ప్రకటనలోనే అన్ని విషయాలున్నాయని చెప్పి ఆయన మీడియా నుంచి నిష్ర్కమించారు.
కేసీఆర్ దీక్ష విరమణ:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సమ్మతి తెలిపి దీక్ష విరమించమని కేసీఆర్*ను విజ్ఞప్తి చేసిన దరిమిలా ఆయన పదకొండు రోజులుగా చేస్తున్న తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. ఆయనతో టిఆర్*ఎస్* సిద్ధాంతకర్త జయశంకర్* నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసారు. మరోవైపు కేంద్రం నిర్ణయం వెలువడగానే తెలంగాణవ్యాప్తంగా సంబరాలు మిన్నుముట్టాయి. కేసీఆర్* దీక్ష నిర్వహిస్తున్న నిమ్స్* ఆసుపత్రి పరిసర ప్రాంతాలు హర్షాతిరేకాలతో దద్దరిల్లుతున్నాయి. బాణాసంచా పేలుళ్లు జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ ప్రాంత విశ్వవిద్యాలయాలు మార్మోగుతున్నాయి. అలాగే విద్యార్థి సంఘాలు నిర్వహించతలపెట్టిన రేపటి శాంతి ర్యాలీని కూడా రద్దు చేసుకుంటున్నట్లు జెఎసి ప్రకటించింది.
తెలంగాణకు ఓకే:
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించింది. రాత్రి 11.30 గంటలకు కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్* రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రోశయ్యను ఆదేశించినట్లు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తక్షణం ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు
కేసీఆర్కు చిదంబరం ఫోన్:
కేసీఆర్* చేత దీక్ష విరమింపజేసేందుకు కాంగ్రెస్* కోర్*కమిటి ప్రయత్నాలు చేస్తోంది. రెండోసారి కోర్* కమిటీ సమావేశమయిన అనంతరం కేసీఆర్*కు ఢిల్లీనుంచి ఫోన్* వచ్చింది. ఫోన్*లో హోంమంత్రి చిదంబరం మాట్లాడినట్లు సమాచారం. కేసీఆర్* తరపున టీఆర్*ఎస్* సిద్ధాంతకర్త ఫోన్*లో మాట్లాడినట్లు తెలిసింది. మొత్తం మీద కేసీఆర్* దీక్ష విరమించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
తెలంగాణపై త్వరలో నిర్ణయం : మన్మోసన్సింగ్:
ప్రత్యేక తెలంగాణపై త్వరలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుపుతామని ప్రధానమంత్రి మన్మోసన్*సింగ్* తెలిపారు. బుధవారం జరిగిన పార్లమెంట్* సమావేశాల్లో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై చర్చకు వచ్చింది. దీనిపై ఆయన మట్లాడుతూ.. ఈ అంశంపై ఇతర ప్రాంతీయ పార్టీలతో చర్చిస్తున్నామన్నారు. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కోర్*కమిటీతో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు
at last telangana people got it !!
i think at last tirupathi would be the next capital
0 responses: